కాలేశ్వరంలో శరన్నవరాత్రొత్సవాలు ప్రారంభం..    

కాలేశ్వరంలో శరన్నవరాత్రొత్సవాలు ప్రారంభం..    

మహాదేవ్ పూర్, ముద్ర:శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవములను పురస్కరించుకొని శ్రీ కాలేశ్వర  ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానం కాలేశ్వరం యొక్క అనుబంధ దేవాలయాలైన శ్రీ శుభానంద మరియు శ్రీ సరస్వతి దేవి ఆలయాల్లోదేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ త్రిపురారీ కృష్ణ మూర్తి శర్మ ఆధ్వర్యంలో అమ్మవార్లకు పూర్ణాభిషేకం అలంకరణ,ఉదయం 10.15 గంటలకు గణపతి పూజ, స్వస్తి పుణ్యహవచనం ఆకండ దీపారాధన, దీక్ష వస్త్రదారణ,  రక్షా బంధనం, మండపారాదన , హారతి,మంత్ర పుష్పం, తీర్ద, ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. మరియు కాళేశ్వరం వస్తవ్యులు  శ్రీ రామగుండం రాoమూర్తి దంపతులు శ్రీ శుభానంద అమ్మవారికి వెండి ముఖ కవచం బహుకరించడం జరిగినది, మరియు శుభానoద అమ్మవారి ఆలయ ధ్వజస్థభంకు సుమారు 3,00,000/-విలువ గల ఇత్తడి తొడుగు తయారు చేయిచి సమర్పించారు తర్వాత , శ్రీమతి ఈదులపల్లి శాంతి శ్రీ కుటుంబ సభ్యులు శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయ ధ్వజస్థంభంకు 1,80,000/- రూపాయల విలువతో ఇత్తడి తొడగు తయారు చేయించి సమర్పించారు.ఇట్టి కార్యక్రమం లొ ఆలయ ఈఓ ఎస్ మహేష్ గారు చైర్మెన్ లింగంపల్లి శ్రీనివాస రావు గారు, ధర్మకర్తలు కామిడి రాoరెడ్డి, ఆడుప సమ్మయ్య, ప్రశాంత్ రెడ్డి, బండి రాజయ్య, కలికోట దేవేందర్, కుంబం పద్మ, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్,దేవాలయం ఆర్చకస్వాములు,సిబ్బంది,కాళేశ్వరం గ్రామ స్తులు భక్తులు పాల్గొన్నారు.