ఆలయాలు ఆధ్యాత్మిక క్షేత్రాలు.. - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

ఆలయాలు ఆధ్యాత్మిక క్షేత్రాలు.. - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ఆలయాలు ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఆదివారం జరిగిన ఆలయ ప్రతిష్ట మహోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలం జూకల్ గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గోరికొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గణపతి, భక్తాంజనేయ, కాశీ విశ్వేశ్వర, నందీశ్వర, శ్రీ చక్ర సహిత దుర్గాదేవి, విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు. రేగొండ మండలం నారాయణపూర్ లో గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన శ్రీ పెద్దమ్మ తల్లి, శ్రీలక్ష్మీ, మహాలక్ష్మి, గ్రామ దేవతల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకల్లో పాల్గొని, ప్రతిష్ట మహోత్సవ వేడుకలకు తమ వంతుగా లక్ష రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గొర్రె సాగర్, సర్పంచ్ పుట్టపాక మహేందర్, నాయకులు పిట్ట సురేష్, జంబుల చంద్రమౌళి, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.