దుబాయిలో మృతి చెందిన నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

దుబాయిలో మృతి చెందిన నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
  • సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

ముద్ర, ఎల్లారెడ్దిపేట :ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివయ్య గారి  నవీన్ 29 కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవీన్ బ్రతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లిండని వారం రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ తల్లి నరసవ్వ, తండ్రి నరసయ్య భార్య మమతలను  పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆకలి చావులుగాని బ్రతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం గాని ఆగుతాయని అనుకొని తెలంగాణ సాధిస్తే ఈ ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కోసం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం  లేదని విమర్శించారు.వీర్నపల్లి మండలం కేంద్రానికి చెందిన తిరుపతి అని గిరిజనుడు అబుదాబిలో వారం రోజుల నుండి కోమాలోకి వెళ్లి ఇప్పటివరకు  కోలుకోవడం లేదన్నారు. నవీన్ కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. అంతేకాకుండా నవీన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పేర్కొన్నారు.ఇటువంటి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు ఉన్నారు.