జాతీయ అవార్డు అందుకున్న నేవూరి - జాతీయస్థాయి సామాజిక సేవా కార్యకర్త అవార్డు

జాతీయ అవార్డు అందుకున్న నేవూరి - జాతీయస్థాయి సామాజిక సేవా కార్యకర్త అవార్డు

ముద్ర,ఎల్లారెడ్డిపేట: జాతీయస్థాయి  అవార్డు ఢిల్లీలో అందుకున్న  ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నేవూరి వెంకట్ రెడ్డి గత 15 ఏళ్లుగా  సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు గుర్తించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెక్టార్ జనపథ్ న్యూఢిల్లీ వారు ఉత్తమ సేవా కార్యకర్త అవార్డుకు ఎంపిక చేయగా ఈ అవార్డును సోమవారం రాత్రి  ఢిల్లీలో అందుకున్నారు.  ఈ అవార్డు రావడం పట్ల ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.