వర్షం నీరు లో కొల్లూరు దగ్గర  ఓ ఆర్ ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు

వర్షం నీరు లో కొల్లూరు దగ్గర  ఓ ఆర్ ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు
  • నిలిచిన రాకపోకలు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి :-సైబరాబాద్ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రవేశం, నిష్క్రమణ  మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి.వాన నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ నంబర్ 2 దగ్గర  కొల్లూరు సిఐ సంజయ్ పోలీస్ సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు నిలిచి ఉన్న నీటిని ట్రాక్టర్ పంపింగ్ సహాయంతో నీటిని తోడేస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.