సిరిసిల్ల పట్టణం లో డ్రై డే లో భాగంగా ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల పట్టణం లో డ్రై డే లో భాగంగా ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ముద్ర సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల పట్టణం లోని 19 వార్డులో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి  డ్రై డే లో భాగం గా ఆకస్మిక తనిఖీ చేసారు. డ్రై డే లో భాగంగా ఇండ్లలో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డ్ లోని పరిసరాలను పరిశీలించి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికపుడు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ తనిఖీ లో కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వార్డ్ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్, ఆర్పీ లు, వార్డ్ ప్రజలు ఉన్నారు.