ప్రణాళిక బద్దమైన చదువుతో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు: జిల్లా విద్యాధికారి

ప్రణాళిక బద్దమైన చదువుతో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు: జిల్లా విద్యాధికారి

ముద్ర సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల పట్టణం లోని గీతానగర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంకి గాను పదవ తరగతిలో 
అత్యధిక జిపిఏ లు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నజిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ 10 జిపిఏ  సాధించిన  బుర్ల శ్రీలక్ష్మి, 9.8 సాధించిన పిట్ల తేజస్విని, 9 కి పైగా జిపిఏ  సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులందరూ ఎప్పుడు నేర్చుకొవాలన్నతపన ఉండాలని, విజ్ఞానాన్ని పెంచుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకొని సమాజంలో మంచి పౌరులుగా రూపొందాలని అన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్యరేఖ మాట్లాడుతూ విద్యార్థులు మంచి అలవాట్లు అలవరచుకోని అభివృద్ధి చెంది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రధానోపాధ్యాయులు భాగ్యరేఖ, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ చేతుల మీదుగా 10 జిపిఏ సాధించిన శ్రీ లక్ష్మి కి 1000 రూపాయలు, 9.8 జిపిఏ సాధించిన  తేజస్విని  కి 500 రూపాయలు, 9.5 జిపిఏ పైనా సాధించిన విద్యార్థులకు 300 రూపాయలు చొప్పున  ప్రోత్సాహకంగా అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల ఉపాధ్యాయిని ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.