విజ్ఞాన, విద్యా సేవా కేంద్రాలుగా టీఎస్ యుటిఎఫ్ భవనాలు

విజ్ఞాన, విద్యా సేవా కేంద్రాలుగా టీఎస్ యుటిఎఫ్ భవనాలు

 స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
ముద్ర ప్రతినిది, భువనగిరి: టీఎస్ యుటిఎఫ్ భవనాలు ఉపాధ్యాయులకే కాక సామాజిక విజ్ఞాన,విద్యా సేవా కేంద్రాలుగా  వెలసిల్లుతున్నాయని భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి  మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి బంజారాహిల్స్ భువనగిరిలోని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తూ అన్నారు. టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి  ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి , ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి  పునాదిలో ఇటుక ,సిమెంట్ వేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు ఎం రాజశేఖర్ రెడ్డి , నాగమణి ,

యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ అధ్యక్షులు మిర్యాల దామోదర్ , ప్రధాన కార్యదర్శి ముక్కెర్ల యాదయ్య , కోశాధికారి ఇటికాల మల్లేశం, ఉపాధ్యక్షులు వెంకటాచారి, జిల్లా కార్యదర్శులు మెతుకు సైదులు, బొమ్మగాని ముత్యాలు, వెంకట్ రెడ్డి, కంచి రవికుమార్, మమత, కరుణాకర్, కే శ్రీనివాస్, కేజీబీవీ రాష్ట్ర కన్వీనర్ లక్ష్మి , టీఎస్ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిల్వేరు మహేష్ , సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి , ఆవాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్ , గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరు బాలరాజు , పూర్వ జిల్లా కార్యదర్శిలు కుకుడాల గోవర్ధన్ , వనం శాంతి కుమార్,పెండెం నాగార్జున, మోహన్ రెడ్డి, టప్రా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణమ్మ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అనిల్ కుమార్  అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇతర నాయకులు పాల్గొన్నారు.