పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్ భగత్

పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్ భగత్

ముద్ర ప్రతినిధి భువనగిరి :పట్టణంలో ని 7వ వార్డుకు చెందిన పిట్టల నర్సింహ్మ ఇటీవల అప్పుల భాదతో ఆత్మహత్య చేసుకుని మృత్యువాత పడగా  పేదరికంతో కూరుకుపోయిన ఆ కుటుంబానికి కౌన్సిలర్ దిద్దికాడి భగత్  సోమవారం 50 కిలోల బియ్యం, నిత్యవసరాల సరుకులు పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో నరసింహ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గతంలో కూడా ఆయన తమ 7వార్డులో అనేక సేవ కార్యక్రమాలు చేపట్టారని కూడా వార్డు ప్రజలు తెలిపారు. అనంతరం వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సదరు కాంట్రాక్టర్ తో ఫోన్ చేసి జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకుని అభివృద్ధి పనులలో ఎక్కడ తావు లేకుండా పూర్తిస్థాయిలో పనులను చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు రేపాక రజిని, వార్డు అధ్యక్షులు నరాల రమేష్, కార్యదర్శి దిడ్డికాడి శ్రీనివాస్, నరాల రవి, వార్డు ప్రజలు పాల్గొన్నారు .