అంగన్వాడీ ఉద్యోగులపై అధికారుల వేధింపులు మానుకోవాలి.....

అంగన్వాడీ ఉద్యోగులపై అధికారుల వేధింపులు మానుకోవాలి.....
  • సిఐటియు జిల్లా నాయకులు రమేష్ డిమాండ్....

ఆలేరు (ముద్ర న్యూస్):సమస్యల పరిష్కారం కోసం గత 22 రోజులుగా నిరవదిక సమ్మె చేపట్టినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరమని సిఐటియు జిల్లా నాయకులు మోరిగాడి రమేష్ అన్నారు. మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో అంగన్వాడి సమ్మె శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సమ్మెను పరిష్కరించలేని ప్రభుత్వం దొడ్డిదారిన అధికారులతో అంగన్వాడీ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. వెంటనే అంగన్వాడి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించి అమలు చేసి. ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించారు. అంగన్వాడి ఉద్యోగులకు ఈఎస్ఐ. పిఎఫ్ సౌకర్యం కల్పించి అదనపు పనులను అప్పగించద్దని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పదవీ విరమణ సౌకర్యాలు కల్పించి టీచర్లకు పది లక్షల రూపాయలు. ఐదు లక్షల రూపాయల వారితోష్కం అందించాలని చెప్పారు. ప్రభుత్వం అంగన్వాడి సమస్యలను పరిష్కరించకుండా రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడం తో పాటు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొడుతూ రెచ్చగొట్టే దూరనులు మానుకోవాలని హితువు పలికాడు. అంగన్వాడి సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడి సంఘం నాయకురాళ్ళు పద్మ. రమ. లక్ష్మి. మంజుల. మనోరమ. అనూష. సరిత. భారతి. నవీన. రేణుక. రత్న. బాలమణి. పుష్పలత. అరుణ తో పాటు తదితరులు పాల్గొన్నారు.....