ప్రజా పోరాటాలను ముందుకు తీసుకువెళ్లడం ద్వారానే అమరవీరుల ఆశయాలను సాధిస్తాం......

ప్రజా పోరాటాలను ముందుకు తీసుకువెళ్లడం ద్వారానే అమరవీరుల ఆశయాలను సాధిస్తాం......
  • సిటీ ఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్దన్ పిలుపు.....

ఆలేరు (ముద్రణ న్యూస్):దేశంలో దోపిడి రహిత తమ సమాజా నిర్మాణం కోసం ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ. దోపిడి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా పోరాటాలను ముందుకు తీసుకువెళ్లాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మరియు కొలనుపాక మాజీ సర్పంచ్ ధర్మ విఠల్ రెడ్డి. మంచిర్యాల జిల్లా ఐ ఎఫ్ టి యు నాయకులు తోకల తిరుపతి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మనబోయిన అనసూర్య వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధర్మ విఠల్ రెడ్డి కొలనుపాక గ్రామ సర్పంచ్ గా ఆలేరు మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి ప్రజలకు ఉపయోగపడే అనేక మంచి కార్యక్రమాలు తీసుకున్నారని గుర్తు చేశారు. నిరంతరం ప్రజా సమస్యలపై. రైతు కూలీల సమస్యలపై. అనగారిన వర్గాలకు చెందిన పేద ప్రజల పై జరుగుతున్న దోపిడీ. పీడన. అణచివేత. అన్యాయాలు.

దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తూ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ప్రజల నాయకుడిగా ఎదగడానికి జీర్ణించుకోలేని పీపుల్స్ వార్ గ్రూపులో పనిచేసే అరాచకవాదులు 1991లో అత్యంత దారుణంగా హత్య చేశారని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతూ దోపిడి రహిత సమాజమే లక్ష్యంగా పనిచేసిన విఠల్ రెడ్డి ఆశయం అయిన నూతన ప్రజాస్వాంక విప్లవాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు శక్తివంతన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో కనీస మౌలిక సమస్యలను పరిష్కరించ లేకుండా విఫలం అయిన ఎమ్మెల్యేలను ఓడించి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చేసే వారిని గెలిపించాలని ప్రజలకు సూచించారు. ప్రజల నుండి దోచుకున్న వేల. లక్షల కోట్ల రూపాయలను ఎన్నికలలో పదవి కొనుగోలు కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలు అధికారం చలాయించి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కారని మండిపడ్డారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. నరేంద్ర మోడీ. కెసిఆర్ మోసపూరిత వాగ్దానాల పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ప్రజలను ఎన్నికలలో మచ్చిక చేసుకోవడానికి మూడు వేల రూపాయల నుండి 6000 రూపాయల వరకు ఒక్కో ఓటుకు ఇచ్చేందుకు పూర్తిగా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైపల్యం చెందిన బిజెపి. బైఆర్ఎస్ పార్టీలను ప్రజలు తిరస్కరించి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్. ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బర్మ బాబు. పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీకాంత్. సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఇక్కిరి కుమార్. వివో డబ్ల్యూ జిల్లా నాయకురాలు పద్మ శశిరేఖ. ప్రజా సంఘాల నాయకులు వంగాల నరసింహారెడ్డి. సత్యనారాయణ. తమ్మడి అంజయ్య. కోమ్మిడి గోపాల్ రెడ్డి. తమ్మడి రమేష్. శికిలం వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.....