కుంభం గెలుపు కోసం పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు సైనికులుగా పనిచేయాలి

కుంభం గెలుపు కోసం పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు సైనికులుగా పనిచేయాలి

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కోసం పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు సైనికులుగా పనిచేయాలని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్రె నరేష్, భువనగిరి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవేస్ చిస్తీలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సోమవారం భువనగిరి పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కోసం భువనగిరి పట్టణ 35 వార్డులలో యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను క్లుప్తంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  గెలుపు కోసం యువజన కాంగ్రెస్ నాయకులు సైనికులుగా  ఈ 17 రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం పని చేయాలని కోరారు. పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పడిగల  ప్రదీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట గిరీష్ కుమార్ గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ సభ్యులు  కాకునూరి మహేందర్, మాచర్ల వినయ్, ఎండి బురాన్, అసెంబ్లీ యువజన కాంగ్రెస్ కమిటీ సభ్యులు కొల్లూరి రాజు, శ్రీలత, పోతన సత్య శివప్రసాద్, జంగిటి వినోద్, అందే నరేష్, గౌరీకర్ రాజు, మహేందర్, వడిచర్ల శరత్ యాదవ్, కొత్త జానీ యాదవ్, గొపే బాబు, దాసరి మధు, మోతే మనోహర్, దాసరి మహేందర్ పాల్గొన్నారు.