ప్రతి పేదవాడికి న్యాయం జరగాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలి : పైళ్ళ శేకర్ రెడ్డి

ప్రతి పేదవాడికి న్యాయం జరగాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలి : పైళ్ళ శేకర్ రెడ్డి

వలిగొండ (ముద్రన్యూస్) : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవారికి సంపూర్ణమైన న్యాయం జరగాలంటే అది ఒక బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి పైల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజు వలిగొండ మండలంలోని లోతుకుంట, నర్సాయిగూడెం, అరూరు, వెంకటాపురం, గురునాథ్ పల్లి గ్రామాలలో విస్తృత పర్యటన నిర్వహించారు. బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డికి గ్రామాలలోని  యువకులు, గ్రామస్తులు మహిళలు మంగళ హారతులతో ఘన  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్రూర్ గ్రామంలో  రోడ్ షోలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాలలో ఎన్నో ఆటుపోట్లు అధిగమించి రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా కేసీఆర్ తీర్చిదిద్దారని, రైతులకు, మహిళలకు, వృద్ధులకు, యువతి, యువకులకు, అన్ని రకాల ప్రజలకు, కులము, మతము, ప్రాంతము బేధం లేకుండా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలుపరిచి పేదవారి పక్షాన పోరాడుతున్నారని అన్నారు.

దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి వంటి పథకాలలో ప్రతిపక్ష పార్టీలు ప్రజల మధ్య,  చిచ్చుపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి దళితులకు దళిత బంధు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఒకప్పుడు కరెంటు కోతలతో ఇబ్బంది పడ్డ రాష్ట్రం ఇప్పుడు 24 గంటలు కరెంటు అందిస్తూ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని, తెలిపారు. భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నాకు రెండుసార్లు అవకాశం ఇచ్చి అభివృద్ధికి దోహదపడ్డారని, వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు నమ్మించి గొంతు కోసే విధంగా కల్లబొల్లి మాయమాటలు చెప్తారని వాటిని నమ్మితే రాష్ట్రం మళ్ళీ అంధకారంలోకి వెళుతుందని, అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.