యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి సోదరుడు..

యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి సోదరుడు..

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య తన నివాసానికి ఆహ్వానించి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేసిన అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం. మున్సిపల్ కౌన్సిలర్లు. ఎంపీటీసీ సభ్యులు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్. పట్టణ అధ్యక్షులు బంధారపు బిక్షపతి గౌడ్. పట్టణ గౌరవ అధ్యక్షులు ముక్కెర్ల మల్లేష్ యాదవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.