మోత్కూరుకు నూతన 108 వాహనం

మోత్కూరుకు నూతన 108 వాహనం

మోత్కూరుకు ఇచ్చిన కొత్త 108 వాహనం

మోత్కూర్ (ముద్ర న్యూస్):మోత్కూరుకు కొత్త 108 వాహనం వచ్చింది. ఇక్కడ ఉన్న వాహనం పాతదై పదే పదే మరమ్మతులకు వచ్చి పలుమార్లు రోజుల తరబడి 108 సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇటీవల ప్రభుత్వ కోత్తగా కొనుగోలు చేసిన వాహనాల్లో మోత్కూరుకు నూతన 108 వాహనాన్ని ఇచ్చారు. మోత్కూరు కేంద్రంగా మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండలాల ప్రజలకు 108 సేవలు అందుతున్నాయి. కొత్త వాహనం రావడంతో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలకు 108 సేవలు అందనున్నాయి.