కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

మోత్కూర్(ముద్ర న్యూస్):చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత దినోత్సవం రోజున పలు సంక్షేమ పథకాలను ప్రకటించిన రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చిత్ర పటానికి మోత్కూర్ మున్సిపాలిటీ లోనిస్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మార్కండేయ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.మార్కండేయ చేనేత సహకార సంఘం అధ్యక్షులు కొక్కుల సత్యనారాయణ గారు మాట్లాడుతూ నేతన్న లకు చేయూత పథకాన్ని అందించిన కెసిఆర్, కేటీఆర్ చేనేత కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసి కంటి లక్ష్మీ నరసయ్య, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచం కన్నయ్య పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పోచం బిక్షపతి కార్యదర్శి జిల్లా రవీందర్ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతకింది చంద్రమౌళి ,సహాయ కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ ,ఎలగందుల అమరేందర్ ,రేగోటి శ్రీనివాస్, రేగోటి సత్యనారాయణ ,జల్దీ సోమయ్య, తాటి లక్ష్మణ్, ఎల్లా వెంకటేశం, బిరుదు శీను, దోర్నాల నరహరి చుంచు లక్ష్మయ్య బిరుదు శీను తదితరులు పాల్గొన్నారు.