మణిపూర్ లో జరుగుతున్న హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయాలి.

మణిపూర్ లో జరుగుతున్న హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయాలి.

మోత్కూర్(ముద్ర న్యూస్): మణిపూర్ రాష్ట్రంలో రెండు తెగల మధ్య రగులుకున్న హింస కుకి తెగకు చెందిన క్రైస్తవులను హింసించి మహిళలను నగ్నంగా రోడ్డుపై ఊరేగించడాన్ని మోత్కూరు మండలం అన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. గురువారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని క్రైస్ట్ కల్వరి చర్చ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మోత్కూరు మండల పాస్టర్స్ కమిటీ నాయకులు .మాట్లాడుతూ మణుపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయాలన్నారు.

మోత్కూరు మండల క్రైస్తవ సంఘం నాయకురాలు సూరారం అనసూయ మాట్లాడుతూ గత మూడు నెలల క్రితం మణిపూర్ రాష్ట్రంలో జరిగిన దారుణ సంఘటన భయానక హింసకాండపై తాము తీవ్రంగా చలించిపోయామని, ఆరాష్ట్రంలో జరుగుతున్న రెండు తెగల మధ్య హింసలో భాగంగా చర్చిలను కాల్చివేయడం, ఇండ్లను కూల్చివేయడం జరిగిందని, మైనార్టీగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆరాష్ట్రంలో శాంతి నెలకొనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను చేపట్టాలన్నారు. మోత్కూరు మండల పాస్టర్ బాకీ పరంజ్యోతి మాట్లాడుతూ క్రైస్తవులు ఎవరిమీదికి యుద్ధానికి పోయేవారు కారని, దేశం కోసం, ప్రజల కోసం ప్రార్థనలు చేస్తూ ప్రజలందరి మేలుకోరే వారని, మణుపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొనే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు మండల పాస్టర్స్ కమిటీ సభ్యులు పాస్టర్ కాపర్తి సైమన్, విజయరాజు, వాసు, నతానియల్, కే.బాబు డి.పౌలు, తదితరులు పాల్గొన్నారు