ఇసుక బుకింగ్ నీల్ల్... లారీలు మాత్రం ఫుల్ల్

ఇసుక బుకింగ్ నీల్ల్... లారీలు మాత్రం ఫుల్ల్

ఓడేడు నుంచి వేబిల్లు లేకుండా పట్టపగలే ఇసుక అక్రమంగా తరలిస్తున్న క్వారీ నిర్వహుకులు...

పట్టించుకోని టీఎస్ఎండిసీ అధికారులు ఓడేడు లో మానేరు వాగుపై ఇసుక క్వారీలో జరుగుతున్న భారీ అక్రమాలు...

ముద్ర ముత్తారం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇసుక క్వారీల పరిమిషన్, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లలకు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బుకింగ్ కాకుండానే ఇసుక లారీలలో అక్రమంగా ఇసుకను తరలించకపోతున్న చిత్రం మీరు ఇప్పుడు పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడేడు మానేరు ఇసుక క్వారీలో చూడచ్చు... మానేరు క్వారీ నుంచి లారీలు వందల కొద్ది ఇసుక లారీలు అక్రమంగా పోతున్న పట్టించుకునే ఒక్క అధికారి లేడు అంటే అసలు జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఉందా?లేదా?అని ప్రజలు నివ్వరబోతున్నారు.

దీంతో ఇసుక క్వారీల యాజమానులు పర్మిషన్ క్వారీలు అక్రమంగా ఇసుకను హైదరాబాద్ కు తరలిస్తూ జిల్లాలో అందిన కాడికి దోచుకుంటున్నారు. కోట్ల రూపాయల అక్రమ వ్యవహారం అధికారులకు తెలియకుంటేనే నడుస్తుందా?అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముత్తారంలో వే బిల్లులు గ్రామస్తులు అడుగుతే చూపించకుండా లారీలను దౌర్జన్యంగా తరలించకుపోయిన నిర్వాహకులను చూసి అసలు జిల్లాలో టీఎస్ఎండిసీ. మైనింగ్ శాఖ ఉన్నట్లా?లేనట్లా? అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో బిజీ బిజీగా ఉండడంతో ఇసుక కాంట్రాక్టర్లు అక్రమంగా లారీలు తరలించి కోట్లలో సంపాదిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వేబిలు లేకుండా పోతున్న లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.