పాడి రైతులకు పాల క్యాన్లను పంపిణీ చేసిన బీర్ల...

పాడి రైతులకు పాల క్యాన్లను పంపిణీ చేసిన బీర్ల...

తురకపల్లి (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గంధ మల్ల మధిర గ్రామం అయిన ఇంద్ర నగర్ లో పాల ఉత్పత్తి దారులకు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రశాంత్ ఏర్పాటు చేసిన పాల క్యాన్ల పంపిణీ కార్యక్రమానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా హాజరై పాల క్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు పాల క్యాండిడేట ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్వయంగా గమనించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాల క్యాన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రశాంతును ఆదర్శంగా తీసుకుని మరింత మంది దాతలు ముందుకు వచ్చి పాడి రైతులకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి. ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ నగేష్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఆలేరు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనవత్ శంకర్ నాయక్. సభ్యులు కానుగంటి శ్రీనివాస్ యాదవ్. శ్రీమతి ప్రతిభ రాజేష్ నాయక్. మోహన్ బాబు నాయక్ తో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు. పాల ఉత్పత్తిదారులు. తదితరులు పాల్గొన్నారు....