మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

భూదాన్ పోచంపల్లి, ముద్ర;మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు అన్నారు. శుక్రవారం భువనగిరి నియోజకవర్గం శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డిని హైదరాబాదులో కలుసుకొని సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్నం భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులను చెల్లించి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని , ఈఎస్ఐ ,పిఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, మధ్యాహ్న భోజనం కార్మికులు వెంకటమ్మ, భూలక్ష్మి, జ్యోతి, సరస్వతి, సాలమ్మ, భాగ్య, కవిత, శివమ్మ, యాదమ్మ, విజయ, సుజాత, యశోద తదితరులు పాల్గొన్నారు.