ప్రతి ఒక్కరూ భగవద్గీతను ఆచరించాలి 

ప్రతి ఒక్కరూ భగవద్గీతను ఆచరించాలి 

పెద్ద శంకరంపేట, ముద్ర: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీతను చదివి అనుసరించాలని పెద్ద శంకరంపేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ అన్నారు. గురువారం పెద్ద శంకరంపేట లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో ఇస్కాన్ టెంపుల్ అత్తాపూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవచనాలు భక్తి భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అలుగుల సత్యనారాయణ వంద మందికి ఉచితంగా భగవద్గీత పుస్తకాలను అందజేశారు. జీవిత పరమార్థం తెలియజేసేది భగవద్గీత అని,  ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన పేర్కొన్నారు. చిన్నప్పటినుండే విద్యార్థులకు రామాయణ మహాభారతం భగవద్గీత ఇతిహాసాలను చదివించడం అలవాటు చేయాలని అన్నారు.  వీటివల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ దేశభక్తి ధర్మరక్షణ నైతిక విలువలు పెంపొందించడం జరుగుతుందన్నారు. అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్ వారు గ్రామ గ్రామాన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తూ మహాభారతంలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత గురించి అందరికీ  వివరించడం అభినంద నీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు కోణం విఠల్, శిశు మందిర్ ప్రధానాచార్యులు వీరప్ప,  హిందూ సంఘాల బాధ్యులు సీతారామారావు, జైహింద్ రెడ్డి, ఎర్ర శ్రీహరి, శ్రావణ్ కుమార్, సతీష్ గౌడ్, సర్వేశ్వర్,  రవి వర్మ, శైలేష్, కాజిపల్లి సంతోష్ కుమార్, గాండ్ల సంగమేశ్వర్, అధిక సంఖ్యలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.