కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు అమలు చేయాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు అమలు చేయాలి
  • టిడిపికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలి
  • టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు  రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ ఫంక్షన్  హాల్లో మెదక్ పార్లమెంటు పరిది మినీ మహానాడు కార్యక్రమం నర్సాపూర్ తెలుగుదేశం పార్టీ  కోఆర్డినేటర్ హనుమంతు వెంకట రమణ ముదిరాజ్  అధ్యక్షతన నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం చేపట్టి పది సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 22 లక్షల మందికి ఇండ్లను 10 లక్షల మందికి భూమిని పంచాల్సి ఉందన్నారు. 

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు కాసాని వీరేష్ ముదిరాజ్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు స్నిగ్ధరెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి ఇల్లెందుల రమేష్, నర్సాపూర్ కోఆర్డినేటర్ వెంకటరమణ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి గంగాధర్ రావు, రాష్ట్ర నాయకురాలు జోత్స్న,  మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఏకే రమేష్, కాసాని రమేష్, కిరణ్ స్వామిగౌడ్, చంద్రహాస్, సూర్యదేవర లతా, భూమేష్, మీసాల కృష్ణ, కొండి కుమార్ తదితరులు ఉన్నారు.