పార్టీ ప్రచారంగా మారిన ఉత్సవాలు

పార్టీ ప్రచారంగా మారిన ఉత్సవాలు
  • 22న  దశాబ్ది దగా నిరసన
  • మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:-తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ప్రచారంగా మార్చిందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత పట్లోళ్ల శశిధర్ రెడ్డి విమర్శించారు. ఈ నెల 22వ తేదీన  అన్ని నియోజక వర్గ కేంద్రాలలో దశాబ్ది దగా పేరుతో కేసీఆర్ దిష్టి బొమ్మను రావణ సురుడిలా  తయారు చేసి పది తలలు ఏర్పాటు చేసి, తలలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి భారీ ప్రదర్శనతో దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిధులు  వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ ఇంచార్జ్  మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన రాజకీయాల వ్యవహారాల కమిటీ  (పిఏసీ)లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిసూచన మేరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా ఆర్.డి.ఓకు వినతి పత్రాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమాలు చాలా పెద్దఎత్తున  చేపట్టాలన్నారు.