మెదక్ ఆర్డిఓ సాయిరాం బదిలీ

మెదక్ ఆర్డిఓ సాయిరాం బదిలీ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో  గల మూడు రెవెన్యూ డివిజనల్ అధికారులు బదిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్త అధికారులకు పోస్టింగ్ ఇస్తు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మెదక్ రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన పి. సాయిరాం బదిలీ అయ్యారు. గత మూడు సంవత్సరాలకుపైగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు. మెదక్ కొత్త ఆర్డీవోగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నుండి అంబదాస్ రాజేశ్వర్ బదిలీపై వస్తున్నారు. తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాష్ సైతం బదిలీ అయ్యారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆయన స్థానంలో జయచంద్ర రెడ్డి, ఖాళీగా ఉన్న నర్సాపూర్ కు కొత్త ఆర్డీవోగా వి.శ్రీనివాసులు బదిలీపై రానున్నారు.