బీజేపీ నాయకులు అరెస్ట్

బీజేపీ నాయకులు అరెస్ట్

ముద్ర ప్రతినిధి, మెదక్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  అక్రమ అరెస్ట్ కు నిరసనగా  హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం హావేలిఘన్పూర్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. బిజెపి మండల ఉపాధ్యక్షులు వడ్ల రామచంద్రం, రూపేందర్, మండల ప్రధాన కార్యదర్శులు వి శ్రీనివాస్, సాయిబాబా, బీజేవైఎం మండల నాయకులు కమ్మరి శ్రీకాంత్, బూత్ అధ్యక్షులు వి. యాదగిరి, అనిల్, మహిపాల్ కార్యకర్తలు ఉన్నారు