ఆయుధాలను అప్పగించాలి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

ఆయుధాలను అప్పగించాలి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆయుధాల లైసెన్సులు కలిగిన వారందరూ తమ ఆయుధాలను(అప్పగించాలి)జమచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్రాజర్షి షా  ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల- 2023 ను  దృష్టిలో ఉంచుకుని, ఆయుధాల చట్టం ప్రకారం  లైసెన్సింగ్ అథారిటీ  ద్వారా నవంబర్ 30 వరకు  అనుమతులు పొందిన  ఆయుధాలు ప్రశాంతతను  కాపాడేందుకు మెదక్ జిల్లా   పరిధిలో గల వారు సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా అధీకృత ఆయుధ డీలర్ల వద్ద ఈనెల 16లోగా జమ చేయాలని ఆదేశించారు.  లైసెన్స్ దారులు    పోలీస్ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే, చట్టంలోని తగిన నిబంధనల ప్రకారం చర్య తీసుకోబడుతుందని హెచ్చరించారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను లైసెన్స్ హోల్డర్లు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి తీసుకోవచ్చని తెలిపారు.  ఉత్తర్వుల నుండి మినహాయింపు కోరే వారు జిల్లా ఆయుధ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తుకి  చేయాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎ. పద్మశ్రీని (8019555968) సంప్రదించాలని సూచించారు.