నేను గడీల దొరను కాదు ...

నేను గడీల దొరను కాదు ...
Jagityala MLA Dr Sanjay Kumar
  • అండగా నిలిచిన కవితను ఓడగోట్టారు ... 
  • మళ్ళి మీ వద్దకు రాను ఓట్లు అడుగా ...
  • జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధ, జగిత్యాల : మీకు అండగా నిలిచిన కవితక్కను ఓడగొట్టారు... ఇప్పుడు గెలిచిన అరవింద్ ఏమి చేశారు.. మళ్లీ మీ వద్దకు రాను.. మిమ్మల్ని ఓట్లు అడుగ అవసరమైతే వైద్య వృత్తి చేసుకుంటూ జీవిస్తా అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవేదన పూరిత వాక్యాలు చేశారు. రాయికల్ మండలం మైతాపూర్ లో మీరు నేను కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి గ్రామంలో బస చేసి గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  బాధ అనిపిస్తుందని కవిత ప్రోత్సాహంతో నేను రాజకీయాలకు వచ్చానని మంది మాటలు విని కవితను  ఓడ కొట్టారని కానీ కొత్తగా వచ్చిన ఎంపీ అరవింద్ ఏమి చేశాడని ప్రశ్నించారు. 500 మంది బీడీ కార్మికులు ఉంటే 438 మంది బీడీపీ కార్మికులకు ఒక్కొక్కరికి 1,60,000 మంజూరు చేయించడం కవిత చేసిన తప్ప అని ప్రశ్నించారు. మీరు, కుటుంబ సభ్యులు ఓట్లు వేసి ఉంటే కవిత ఓడిపోయి ఉండేది కాదన్నారు. నేను మళ్ళీ మీ వద్దకు రానని ఓట్లు అడగనని వైద్య వృత్తి చేసుకొని జీవిస్తానని  పేర్కొన్నారు.

ఒకరు కులమని, మరొకరు మతమని వేరు చేస్తున్నారని, నన్ను దొర అంటున్నారని... నాకు గడి ఉందా... నా ఇల్లు చిన్నగా ఉంటుంది.. కానీ కావాలని పని  కట్టుకొని కొందరు వ్యక్తిగత దూషణలు దిగి అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని పరోక్షంగా మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన బోగ శ్రావణ్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఎల్. సంధ్యారాణి సురేందర్ నాయక్, జడ్పిటిసి అశ్విని యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచ్ తిరుపతి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,విష్ణు,పవన్,నసీర్,రాజేశం, గంగారాం, వేణు, ఎంపిడిఓ సంతోష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.