దొరికిన సెల్ ఫోన్ అప్పగించిన మున్సిపల్ కార్మికుడు. అభినందించిన కౌన్సిలర్

దొరికిన సెల్ ఫోన్ అప్పగించిన మున్సిపల్ కార్మికుడు. అభినందించిన కౌన్సిలర్

మెట్‌పల్లి ముద్ర : దొరికిన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు ఓ పారిశుధ్య కార్మికుడు.పట్టణ మున్సిపల్ లో చెత్త సేకరణ వాహన డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న. లంక శ్రీకాంత్ గోల్ హనుమాన్ దేవాలయం ఏరియాలో ఉదయం విధులు నిర్వర్తిస్తున్నాడు ఈ క్రమంలో ఆరపేటకు చెందిన సన్వాజ్ అనే వ్యక్తి ఆ దారిలో 18 వేల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఆ సెల్ ఫోన్ మున్సిపల్ కార్మికుడు శ్రీకాంత్ కు దొరకగా ఫోన్ పోయిన వ్యక్తి వెతుకుతుండగా గమనించి కౌన్సిలర్ చర్లపల్లి లక్ష్మి రాజేశ్వర్ గౌడ్ సమక్షంలో పొన్ పోయిన వ్యక్తికి అందజేశాడు. మున్సిపల్ కార్మికుని నిజాయితీకి. కౌన్సిలర్ తో పాటు కాలనీ వాసులు అభినందించారు.