ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు

ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు
  • బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య 
  • శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రెండు కోట్ల నిధులు మంజూరు చేసినందుకు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామి  ఆలయం పునర్నిర్మాణానికి 2 కోట్ల నిధులు దేవాదాయ శాఖ నుంచి  రాష్ట్రమంత్రి కేటీఆర్ మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గురువారం  ప్రకటించారు. అతి త్వరలోనే కొబ్బరికాయ కొట్టి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని  పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా మంత్రి కేటీఆర్ ఆలయాల నిర్మాణాల కొరకు కోట్లాది రూపాయలు మంజూరు చేసినట్లు వివిధ కుల సంఘాల భవనాలకు నిధులు  మంజూరు చేసిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ట్యాబ్ ల పంపిణీకి వచ్చిన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాల స్వామి పునర్నిర్మాణానికి రెండు కోట్ల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించాడు. వందల ఏళ్ల సంవత్సరాల  చరిత్ర ఉన్న ఆలయ పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,సర్పంచ్ వెంకట్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్ తోపాటు  మేగి నరసయ్య, బొమ్మ కంటి రవి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరుశురామ్ గౌడ్, ఎలగందుల అనసూయ నర్సయ్య, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్, వార్డు సభ్యులు, గ్రామంలోని వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కలిసి పలుమార్లు మీటింగులు ఏర్పాటు చేసుకొని ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. రెండు కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కు ప్రజా ప్రతినిధులు,  గ్రామస్తులందరూ ధన్యవాదాలు తెలిపారు.