సమావేశం ముగిశాక ప్రోగ్రామ్ ప్లెక్సీ...

సమావేశం ముగిశాక ప్రోగ్రామ్ ప్లెక్సీ...

ముద్ర, మల్యాల: కొండగట్టు అభివృద్ధి పనుల్లో భాగంగా ముత్యంపేట వరదకాల్వ నుంచి లిఫ్ట్ ద్వారా కొండపైకి నీళ్లు అందించే పనులకు గురువారం భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ తొ పాటు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, స్థానిక, జగిత్యాల ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ రమణ, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, జడ్పి చైర్మన్ వసంత హాజరయ్యారు. అయితే సీఎం ప్రకటించిన అభివృద్ధి పనుల్లో భాగమైన ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి ప్రోటోకాల్ ప్లెక్సీ (సమావేశంలో స్టేజి వెనుకాల) లేకపోవడంపై కలెక్టర్ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు ప్లెక్సీ తెప్పించినప్పటికి కార్యక్రమం ముగియడంతొ ఎమ్ చేసేది లేక, అందరూ వెళ్ళాక స్టేజి వెనుకాల ఏర్పాటు చేశారు.