అత్యంత వేగవంతమైన సేవలను పొందవచ్చు

అత్యంత వేగవంతమైన సేవలను పొందవచ్చు
  • ఆత్యాధునిక, అతి సులభంగా వినియోగించిన టర్టెల్‌ వ్యాక్స్‌ ఉత్పత్తులతో ప్రత్యేకంగా డిటైలింగ్‌ సేవలు
  • టర్టిల్ వాక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సాజన్ మురళీ పురవంగర ప్రారంభించారు.

ముద్ర, తెలంగాణ బ్యూరో: వినియోగదారులు ఇప్పుడు టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియోలో అత్యంత వేగవంతమైన సేవలను పొందవచ్చునని టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాజన్‌ మురళి పురావంగర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరీ ముఖ్యంగా రోడ్డు మీదకు రాకుండానే ఈ సేవలను వినియోగించవచ్చునన్నారు. టర్టెల్‌ వ్యాక్స్‌ ఉత్పత్తులు వాహన బాడీ పెయింట్‌కు ప్రమాదకరం కాని రీతిలో ఉండటంతో పాటుగా అసాధారణ వాతావరణ పరిస్థితులలో సైతం కారు వెలుపలి భాగాలను గీతలు, రంగు మారిపోవడం వంటి సమస్యల నుంచి కాపాడతాయని తెలిపారు. టర్టెల్‌ వ్యాక్స్‌ ఇప్పుడు విస్తృత శ్రేణి ఇంటీరియర్‌ డిటైలింగ్‌ కార్‌ కేర్‌ ఉత్పత్తులు సైతం అందిస్తుందనన్నారు. వినియోగదారులు రోడ్లపైకి రాకముందే త్వరితగతిన శుభ్రంగా మరియు తాజా అనుభూతిని పొందడం కోసం ఇప్పుడు టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియోకి చెక్ ఇన్ చేయవచ్చునని తెలిపారు. టర్టెల్‌ వ్యాక్స్‌ ఉత్పత్తులు వాహనం యొక్క బాడీ పెయింట్‌కు ఎలాంటి హాని కలిగించవని, ప్రతికూలమైన వాతావరణ మార్పులను సైతం తట్టుకోగలవని తెలిపారు.

గీతలు, రంగు పోవటం మరియు వాతావరణ పరిస్థితుల నుండి కారు ఎక్సటీరియర్ కు రక్షణను అందిస్తాయని తెలిపారు. సంపూర్ణ మైన డ్రైవింగ్ అనుభవం కోసం ఇంటీరియర్ క్లీనింగ్ కూడా అంతే అవసరం, మరియు టర్టెల్‌ వ్యాక్స్‌ అనేక రకాల ఇంటీరియర్ డిటైలింగ్ కార్ కేర్ ఉత్పత్తులను కూడా అందిస్తుందనన్నారు. ఈ నూతన భాగస్వామ్యం గురించి ఎక్స్పర్ట్ ఆటో స్పా యజమాని హర్షద్ మహాజన్ మాట్లాడుతూ, “మేము ఎక్స్పర్ట్ ఆటో స్పా వద్ద నూతన ఆవిష్కరణలలో శ్రేష్ఠతను అందించడానికి మరియు కస్టమర్‌లకు ఆహ్లాదపరిచే అనుభవాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్ల సంరక్షణలో గ్లోబల్ లీడర్‌ తో భాగస్వామిగా ఉండటానికి మరియు వారికి ప్రాతినిధ్యం వహించడానికి మేము సంతోషిస్తున్నామని, టర్టెల్‌ వ్యాక్స్‌ తో ఈ అనుబంధం మమ్మల్ని మరింత గా పైకి తీసుకెళ్తుందని, ఇక్కడ కార్ ప్రేమికులకు సంతోషం అందిస్తుందని విశ్వసిస్తున్నామని అన్నారు. 

 ఈ స్టూడియోల ప్రారంభం గురించి ‘‘ మేము హైదరాబాద్‌లో మా మొదటి రెండు స్టూడియోలను ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ నుండి కార్ కేర్‌పై పెరుగుతున్న ఆసక్తిని చూశామని, ఇక్కడ మా ఉనికిని విస్తరించడానికి మరో మూడు కార్ కేర్ స్టూడియోని తెరవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ సరికొత్త స్టూడియోతో, మేము రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమ ప్రీమియం నాణ్యత గల కారు డిటైలింగ్ సర్వీస్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హర్షద్ తెలిపారు. అందుబాటులో ఉన్న ఏకైక డీఐఎఫ్ఎమ్ సేవలను అనుభవించడానికి అతిపెద్ద శ్రేణి వర్గాలు, ఉత్పత్తులను కలిగి ఉన్నందుకు బ్రాండ్ గర్విస్తోందన్నారు. జేనేక్స్, ఎక్స్ప్లోడర్, ఇండియన్ డెకర్స్ అనే మూడు స్టూడియోలతో మా భాగస్వామ్యం ఈ ప్రాంతంలో మంచి కార్ కేర్ సేవలు, ప్రయోజనాలను అందించగలదని మేము విశ్వసిస్తున్నామని తెలిపారు. మేము మా డీలర్ నెట్‌వర్క్‌పై గర్వపడుతున్నామని, రాబోయే సంవత్సరాల్లో దానిని బలోపేతం చేయడం కొనసాగిస్తామని, దేశంలోని టైర్ 2 మరియు టైర్ 3 పట్టణాలలో కూడా కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు.