ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ

ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ

ముద్ర తెలంగాణ బ్యూరో: జాగృతి వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా నాగోల్ లోని లాలన ఫౌండేషన్ అనాథ ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి పండ్లు పంపిణీ చేసి, ఉదయం టిఫిన్ స్పాన్సర్ చేసిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి గారు.

ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను జాగృతి వేదిక ద్వారా విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చరిత్ర ఎమ్మెల్సీ కవితక్క గారిదని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో మహిళా లోకాన్ని ఏకం చేస్తూ జరిపిన పోరాటాలు మరువలేనివని,పార్లమెంట్ లో 2016వికలాంగుల హక్కుల చట్టం  రావడానికి కృషి చేసిన యోధురాలని, మహిళలకు 33% రెసర్వేషన్ కోసం ఢిల్లీ లో  దీక్ష చేసిన తెలంగాణ ఉద్యమ బిడ్డ అని వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నట్లు తెలిపారు