ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ED నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ED నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ED నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9 న విచారణకు రావాలని సూచించింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన ED తాజా పరిణామాలలో కవిత కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో మంగళవారం కవిత ప్రతినిధిగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్ళైను ED అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రిమాండ్ రిపోర్ట్ లోనే కవిత కు తాను ప్రతినిధిగా వ్యవహరించానంటూ వెల్లడించారు. దీనితో ఎమ్మెల్సీ కవిత విచారణకు రావాలని బుధవారం ఉదయం నోటీసులు జారీ అయ్యాయి. 

కాగా మహిళ రిజర్వేషన్ గురించి ఈ నెల 10 న ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద కవిత నిరసన దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఆ నిరసనకు ముందుగానే కవితను ED విచారనుకు పిలవడం ఉత్కంఠంగా మారింది.