ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కి సంఘీభావంగా భువనగిరి భారీ ర్యాలీ

ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కి సంఘీభావంగా భువనగిరి భారీ ర్యాలీ
  •  బ్రహ్మరథం పడుతున్న నియోజకవర్గ ప్రజలు, బిఆర్ ఎస్ అభిమానులు

ముద్ర ప్రతినిధి భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల పై ఐటీ శాఖ అధికారులు అక్రమంగా దాడులు నిర్వహించి మూడు రోజుల పాటు ఇబ్బందుల గురి చేసారు. దీనితో నియోజకవర్గ నాయకులు భువనగిరి లో ఆదివారము ఎమ్యెల్యే కు సంగీభవంగా ఘన స్వాగతం పలుకుతూ   భారీ ర్యాలీ నిర్వహించారు. 

నియోజకవర్గంలోని వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలాలు, మునిసిపాలిటీల నుండి నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్చందంగా కదిలి వచ్చి ప్రదర్శనలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

నిరంతరం ప్రజలకోసం నిస్వార్ధంగా సేవచేస్తున్న తమ నాయకున్ని మోడీ నాయకత్వంలోని కేంద్ర నాయకత్వం బీజేపీ నాయకులు కుట్ర పన్ని ఇలాంటి అక్రమ దాడులు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు.

నిరంతరం పేదవాడి అభ్యున్నతి కోసం పల్లెల అభిహృది కోసం పాటుపడుతున్న తమ నాయకునిపై ఎఇలాంటి కుట్రలు ఎవరు పన్నిన తాము రక్షించుకుంటామని, సామాన్య ప్రజలలో నిరంతరం కలియ తిరుగుతూ మచ్చలేని నాయకునిపై ఇలాంటి దాడులు సిగ్గు చేటని నినదించారు. ర్యాలీ సాగుతున్న సమయములో పట్టణములోని ప్రజలు మహిళలు అన్ని వర్గాల ప్రజలు వీధుల్లోనికి వచ్చి తమ సంఘీభావాన్ని వ్యక్త పరిచారు. మీవెంట మేము నడుస్తామని హామీ ఇచ్చారు. ర్యాలీ మిల్క్ ఫిల్లింగ్ సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణం లోని పుర వీధులగుండా సాగింది. 

ఈ ర్యాలీ లో భువనగిరి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల చైర్మన్లు మండల పరిషత్ అధ్యక్షులు, మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు కౌన్సిలర్ లు జడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ లు వివిధ గ్రామాల సర్పచ్ లు ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.