దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు..

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు..
  • ఆదర్శప్రాయుడు సీఎం కేసిఆర్..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ సీఎం కేసీఆర్ ఆదర్శప్రాయుడుగా నిలిచారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జిల్లాలోని దివ్యాంగుల ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సీఎంకు కృతజ్ఞత సభలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా దివ్యాంగులకి అందిస్తున్న రూ.3016ల అసరా పెన్షన్ ను రూ.4016 లకి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు పెన్షన్ పెంచడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.