సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా

సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా
  • భారీ సంఖ్యలో ధర్నాలో పాల్గొన్న భవన, ఇతర నిర్మాణ కార్మికులు.
  • అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని,పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మిక  సిఐటియు అనుబంధ సంఘం భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మహా ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా  భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతల మల్లయ్య,ప్రధాన కార్యదర్శి యలక సోమయ్య గౌడ్లు ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి  మాట్లాడుతూ భవన ,ఇతర నిర్మాణ కార్మికులందరూ తమ హక్కుల కోసం పోరాటం చేయాలని అన్నారు. వెల్ఫేర్ బోర్డులో 1800 కోట్ల రూపాయలు కార్మికుల కోసం ఖర్చు చేయాలని అన్నారు.వెల్ఫేర్ బోర్డులో నమోదైన భవన నిర్మాణ కార్మికులకు 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి వెల్ఫేర్ బోర్డు నిధుల నుండి 5000/ రూపాయలు పెన్షన్ మంజూరుచేయాలని,డబల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఇళ్ల స్థలాలు,రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీ మేరకు మోటార్ సైకిళ్ల మంజూరు,అన్ని ప్రజా సంఘాలతో అడ్వైజర్ కమిటీ,బోగస్ వెల్ఫేర్ బోర్డు కార్డును తొలగింపు,పెండింగ్ క్లైములకు నిధులు మంజూరు చేయాలని కోరారు.  సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేడు జరిగిన భవన నిర్మాణ కార్మికుల ధర్నా తొలిమెట్టేనని రానున్న రోజులలో ఈ సమస్యలు పరిష్కారం కానున్నట్లయితే మరో ఉద్యమానికి రూపకల్పన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. జిల్లాలోని కార్మికులంతా కలిసికట్టుగా ఈరోజు వందల సంఖ్యలో పాల్గొన్నందున అందరికీ ధన్యవాదాలు తెలిపారు,ఈ కార్యక్రమంలో  సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లకావత్ బాలాజీ నాయక్ సుజాత సోమపంగు రేణుక జడ్డు బాలసౌరిరెడ్డి ఒగ్గు సైదులు వల్లెపు శ్రీనివాస్ జంజనం కోటేశ్వరరావు ఉపతల వెంకన్న షేక్ సత్తార్ షేక్ నాగులు మీరా మాగిలింగయ్య శేఖర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.