ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం దూత్ పల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే చేతులమీదుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ పంట దిగుబడులను దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు. రైతులు పండించిన పంట దిగుబడులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నందున తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని సూచించారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. అదేవిధంగా రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, పార్టీ నాయకులు చెప్పాల శ్రీను, ఆనందం, రాజు, భిక్షపతి, సురేష్, సంపత్ రావు, లింగరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.