ఇంటింటా ఇన్నోవేటర్ లో పాల్గొనాలి..

ఇంటింటా ఇన్నోవేటర్ లో పాల్గొనాలి..
  • వాట్సప్ లో వివరాలు పంపించాలి
  • జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనాలని, ఉత్సాహం ఉన్న వారు ఈ నెల 10లోపు వివరాలు వాట్సాప్ లో పంపించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రతిభను చాటుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం చక్కని వేదికగా నిలుస్తుందని  అన్నారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన 6 వాక్యాలు, 2 నిమిషాల వీడియోను, ఆవిష్కరణ యొక్క 4ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు తదితర వివరాలను వెంటనే  9100678543 కి వాట్సాప్ చేయాలని కోరారు. వచ్చిన  దరఖాస్తుల నుండి మొదటి షార్ట్‌లిస్ట్ తరువాత ప్రతి జిల్లా నుంచి ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపిక చేయబడుతాయని, మరిన్ని వివరాలకు జిల్లా సమన్వయకర్త ఈ డి ఎం శ్రీకాంత్ 79950 05017 సెల్ నంబర్ లో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.