హత్య కేసులో నిందితుల రిమాండ్

హత్య కేసులో నిందితుల రిమాండ్

మహాదేవపూర్, ముద్ర: మండలంలోని కాలేశ్వరం గ్రామంలో భూ తగాదాలతో  ఒకరి హత్య ఇద్దరు గాయపడిన సంఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం నాడు నారా ఈశ్వర్, పట్టి వెంకటమ్మలతో పాటు మరో మైనర్ బాలుడిని రిమాండ్ కు తరలించినట్లు మహాదేవపూర్ సిఐ కిరణ్ కుమార్ తెలిపారు. నారా ఈశ్వర్ కు మామ ఆయిన పట్టి రాములు  వీఆర్ఏ ఉద్యోగం వారసత్వంగా ఈశ్వర్ భార్యకు రావలసి ఉండగా పట్టి మల్లేష్ కోర్టు ద్వారా వీఆర్ఏ ఉద్యోగాన్ని వీరికి దక్కకుండా చేశాడనే ఉద్దేశంతో ఈ సంఘటనకు పాల్పడినట్లు సీఐ కిరణ్ కుమార్ తెలిపారు. భూమి విషయంలో నారా ఈశ్వర్ కు మరియ పట్టి మల్లేష్ కు గత 15 సంవత్సరాల నుండి గొడవలు ఉన్నట్లు సీఐ కిరణ్ తెలిపారుతెలిపారు. గత18 తేదీ  ఉదయం కాలేశ్వరం సెంటర్లో నారా ఈశ్వర్ కూర్చుని ఉండగా పట్టి మల్లేష్ వచ్చి గొడవపెట్టినావని ఈశ్వర్తో అడగగా మాట మాట పెరిగింది. కోపంతో ఈశ్వర్ చేతిలో ఉన్న కర్రతో పట్టి మల్లేష్ ను కొట్టినాడు.

అక్కడే ఉన్న లేతకారి రమేష్ వాళ్ళని విడిపించి వెళ్లిపొమ్మని పంపించాడు. పట్టి మల్లేష్ ఇంటికి వెళ్లి అతని కొడుకు హరీష్, భార్య పోషక్క లను వెంట తీసుకొని వచ్చి మళ్ళీ ఈశ్వర్ తో గొడవకు దిగాడు. ఈశ్వర్  అత్త పట్టి వెంకటమ్మ చంపుతేనే భూమికి ఎదురురారని, విఆర్ఏ ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పథకం ప్రకారం పట్టి మల్లేష్, పోసక్క, హరీష్ లను కర్రలతో తలపై దాడి చేసినట్టు తెలిపారు. పడిపోయిన వారిని స్థానికులు మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంలో మల్లేష్ అదే రోజు చికిత్స పొందుతూ చనిపోయినాడు. అతని కొడుకు పట్టి హరీష్, పోషక్కలు  ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. హత్యకు కారకులైన నారా ఈశ్వర్, పట్టి వెంకటమ్మ, ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్ కు తరలించారు. 3 కర్రలు, 2 సెల్ ఫోన్ లు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు. మహదేవపూర్ సి.ఐ. శ్రీ. టి. కిరణ్ సత్వరం స్పందించిన కాలేశ్వరం ఎస్సై లక్ష్మణరావు, కానిస్టేబుల్లు రమేష్, బాల్ సింగ్, గౌస్, శ్యామ్, ధనుంజయ్, అన్వేష్, హోంగార్డు తిరుపతిలను అభినందిచారు.