ఊపందుకుంటున్న ఇంటింటి ప్రచారం

ఊపందుకుంటున్న ఇంటింటి ప్రచారం

మహాదేవపూర్, ముద్ర: టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఇంటింటి ప్రచారం ఊపందుకున్నది. మండల కేంద్రంలో సర్పంచ్ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం పెద్ద ఎత్తున కార్యకర్తలతో నిర్వహించారు మార్కెట్ కమిటీ చైర్మన్ పెండ్యాల మమత, సీనియర్ నాయకులు మనోహర్, ఆన్కారి ప్రకాష్, దేవస్థానం డైరెక్టర్ కలుకోట దేవేందర్, శ్రీహరి, యూత్ నాయకులు కూరతోట శ్రీహరి, జాగృతి మహేష్, రాజేందర్, దళిత నాయకులు లింగాల రామయ్య,, జనగాం పోశం పార్టీ మైనార్టీ నాయకులు సల్మాన్ ఖాన్ తదితరులు నిర్వహించారు. కాళేశ్వరం లో వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ వసంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు, పలుగుల ముద్దులపల్లి గ్రామాలలో సర్పంచ్ మానెం లక్ష్మయ్య ఆధ్వర్యంలో వెమునూరు జక్కయ్య, తలారి గట్టయ్య, చందు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. సూరారంలో ఇంటింటి ప్రచారంలో సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి దళిత నాయకుడు గోల్కొండ కిరణ్ ఆధ్వర్యంలో మరియు అంబటిపల్లిలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాసరావు, సింగిల్ విండో డైరెక్టర్ మాధవరావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.