వరదకు అడ్డుగా నిలిచిన అన్నారం బ్యారేజ్

వరదకు అడ్డుగా నిలిచిన అన్నారం బ్యారేజ్
  • ముంపుకు కారణం మానవ తప్పిదమా?

మహాదేవపూర్, ముద్ర: భూపాలపల్లి జిల్లాలో కురిసిన ప్రతి భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుల నీటిని, మానేరు వరదను, గోదావరి నదిపై నిర్మించిన అన్నారం బ్యారేజీ అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున ప్రాణాపాయాలు ముంపు ఏర్పడినట్లు తెలుస్తుంది.మేడిగడ్డ బ్యారేజ్ వచ్చిన వరదను వచ్చినట్లే వదిలిపెట్టిన 75 గేట్లు ఎత్తగా, అన్నారం బ్యారేజీ లో ఆరు టీఎంసీల నీరు ఉండేలా మిగిలిస్తూ, గేట్లను ఎత్తకుండా 117 మీటర్ల ఇన్ఫ్లో మట్టాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దీంతో ఉప్పొంగిన మానేరు, ఇతర వాగులు పోటుతో కదలలేక భూపాలపల్లి జిల్లాలో వరదలు ముంచేత్తాయి.

  • పట్టించుకోని భారీ అతి భారీ వర్ష హెచ్చరిక

ఈనెల 12వ తేదీ నుండి వర్షాలు కురుస్తుండగా అధికారులు 18వ తేదీ నుండి అతి భారీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరిస్తూ వచ్చారు. ఈ మేరకు పోలీసులు రెవెన్యూ అధికారులు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. 25, 26, 27 రోజులలో కురిసిన భారీ, అతి భారీ వర్షాలకు ములుగు భూపాలపల్లి ప్రాంతంలోని అనేక చెరువులు తెగిపోయాయి. అన్నారం బ్యారేజీ లో మాత్రం 25వ తేదీ నాడు 30 గేట్లు ఎత్తి  7 టీఎంసీల మిగులు జలాలను ఉంచారు. అన్నారం బ్యారేజీకి ఇన్ఫ్లో 36,105 క్యూసెక్కులు ఉండగా దాదాపు రెట్టింపు స్థాయిలో అవుట్ ఫ్లో 73244 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజీ 30 గేట్లను మాత్రమే తెరిచి ఉంచారు. బ్యారేజీ ఎత్తు 119 మీటర్లు ఉండగా వరద మట్టం 117.18  మీటర్లను ఉంచుతూ నీటిని వదిలారు. వీరు బ్యారేజీ లోపలి మట్టాన్ని తగ్గకుండా చూసుకున్నారు. అతి భారీ వర్ష సూచనలు వీరు పట్టించుకోలేదని అర్థమవుతుంది.

  • గోదావరికి ప్రవాహానికి అడ్డుగా నిలిచిన గేట్లు

26వ తేదీ నాడు గోదావరి ఇతర వాగుల నుండి 66148 క్యూసెక్కుల నీరు, మానేరు పొంగుతుండడంతో 28043 క్యూసెక్కుల నీరు వచ్చి పడింది. మొత్తం అన్నారం బ్యారేజీ ఇన్ఫ్లో 94,211 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అన్నారం బ్యారేజీలో 40 గేట్లను మాత్రం తెరిచారు. కన్నేపల్లి పంపు వదలకూడదనుకున్నారో ఏమో కానీ 6.33 టీఎంసీల నీరు మిగులు ఉండే విధంగా 12,8211 క్యూసెక్కుల నీటిని వదిలారు. వచ్చి చేరుతున్న నీటి కంటే ఎక్కువ నీరు వదిలినప్పటికీ అన్నారం బ్యారేజీ లోపలి మొత్తం 116 నుండి 117 మీటర్లకు తగ్గనీయలేదు. ఇదే నీరు వదిలిపెట్టగానే 108 మీటర్లతో ప్రవహించింది. దిగువ గోదావరి మట్టానికి 8 మీటర్ల ఎత్తున అన్నారం బ్యారేజీలో నీటిని కొనసాగించారు. అన్నారం బ్యారేజ్ లో 118 మీటర్లగా కొనసాగిన నీటి మట్టమే గోదావరి, మానేరు, ఇతర వాగుల ఉధృతికి అడ్డుగా నిలిచింది. పర్యవసానంగా భూపాలపల్లి జిల్లాను వరదలు ముంచేత్తాయి.

  • బ్యారేజీలో తగ్గని మట్టంతోనే వరదలు

మూడు రోజులుగా కురిసిన భారీ అతి భారీ వర్షాలకు ఒకవైపు చెరువులు మోరంచ గ్రామాన్ని ముంచి వేయగా, మానేరు పరివాహక ప్రాంతం లోని గ్రామాలు వరదలకు గురయ్యాయి. దీంతో ఈనెల 27 వ తేదీన అన్నారం బ్యారేజీ 66 గిట్లలో 62 గేట్లను ఎత్తినప్పటికీ మ్యారేజి లో నీటిమట్టం 116.500 మీటర్ల ఎత్తు కొనసాగింది. మానేరు నుండి పెట్టింపు స్థాయిలో 4, 02,220 క్యూసెక్కుల నీరు వచ్చి పడింది. గోదావరి ఇతర వాగుల నుండి 3'87,220 మీరు అన్నారం బ్యారేజ్ కి పోటెత్తింది. గ్యారేజీ 62 గేట్లు ఎత్తినప్పటికీ 116.500 మీటర్ల మట్టంతో బ్యారేజీలో నీరు ఉండటంతో గోదావరి, మానేరు  ఇతర వాగులు జిల్లాలోని ఊళ్లను ముంచెత్తాయి. ఈ ఒక్కరోజు మాత్రమే అన్నార బ్యారేజీ ఫ్రీ ఫ్లోగా ఉండి12,95,191 క్యూసెక్కుల వరదను వదిలివేసినప్పటికీని మొత్తం తగ్గని అన్నారం బ్యారేజీ జిల్లాలోని అనేక మండలాలలో వరదలకు కారణమైంది. జిల్లాలో వరదలు సంభవించిన అందరు 20వ తేదీ నాడు అన్నారు బ్యారేజీలో మొత్తం 66 గేట్లను ఎత్తారు. అయినప్పటికీ బ్యారేజీలో నీటిమట్టం 116.250 మీటర్లకు తగ్గలేదు. వందల సంవత్సరాలుగా ఉంటున్న గ్రామాలు ఎన్నడూ లేని విధంగా వరదలు చుట్టుముట్టడంతో బ్యారేజీల వల్లనే వరదలు వస్తున్నా యని వేలెత్తి చూపుతున్నారు. అన్నారం బ్యారేజీ పరిస్థితి పరిశీలిస్తే అది వాస్తవమని తేలుతున్నది.

  • మేడిగడ్డ గేట్లను తెరిపించిన పొరుగు రాష్ట్రం

మేడిగడ్డ గ్యారేజీ వద్ద ప్రారంభంలో 35 గేట్లు మాత్రమే తెరిచారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గడిచిరోలి జిల్లా కలెక్టర్ మేడిగడ్డ 8గేట్లు మొత్తం తెరవాలని ప్రాజెక్టు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వరద మట్టం క్రమంగా పెరుగుతూ పోవడంతో 25వ తేదీ నుండి 75 గేట్లను ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే వదిలారు. జిల్లాలో వరదలు సంభవించిన రోజు అన్నారం బ్యారేజీ గేట్లు మొత్తం ఎత్తడంతో మేడిగడ్డ వద్ద 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే వదిలిపెట్టారు. మహారాష్ట్ర అధికారుల ఒత్తిడి పుణ్యమా అని మేడిగడ్డ ప్రాజెక్టుకు గండం తప్పిందని సరిహద్దు గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ ల గణాంకాలు పరిశీలిస్తే  మన అధికారులకు నీటి నిర్వహణలో, విపత్తు నిర్వహణలో ఎలాంటి అనుభవం లేదని అర్థమవుతుంది. ఏది ఏమైనా చెరువులకు గండుపడటం, వరదను అన్నారం బ్యారేజీ అడ్డుకోవడం ఇలాంటి మానవ తప్పిదాలతో జిల్లాలో పెను విపత్తు సంభవించిందనేది కాదనలేని సత్యం. విపత్తు నిర్వహణ సామర్ధ్యాలు పెంచుకొని, ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా లోపాలను బేరీజు వేసుకోక తప్పదు. మున్నెన్నడూ చూడని విపత్తును చూడడంతో ప్రజలు వరదలకు బ్యారేజీలే కారణమని తప్పుపడుతున్నారు. చెరువులు తెగితేనే ఇలా ఉంటే కడెం ప్రాజెక్టు తెగితే మా గతి ఏమిటని జిల్లా వాసుల ప్రశ్న.