ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలి...

ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలి...
  •  ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కొరకు రూ. 56 లక్షలు కేటాయింపు
  • గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 
  •  గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత  పాఠశాల వార్షికోత్సవ వేడుకలు మరియు ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో టెన్త్  విద్యార్థులకు మెటీరియల్  పంపిణీ 

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :

గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వార్షికోత్సవ  వేడుకలు మరియు ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు  మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల  కృష్ణమోహన్ రెడ్డి. హాజరయ్యారు. ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ విద్యార్థులు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆర్ ఆర్ ఆర్. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా గద్వాల జిల్లా ఎన్టీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు చిరు ముదిరాజ్. ఆధ్వర్యంలో ఎమ్మెల్యే. చేతుల మీదుగా 10వ తరగతి  విద్యార్థులకు మెటీరియల్     అందజేశారు.
పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యే కి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.


వార్షికోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులు నాటు నాటు పాటకు  డాన్స్ చేయగా ఎమ్మెల్యే వీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..

1934 సంవత్సరంలో ఈ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల స్థాపించడం జరిగిందన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం అత్యున్నత స్థాయి ఉద్యోగాలలో రాజకీయ రంగాలలో అనేక రంగాలలో  రాణిస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం ఎన్నడు ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో  పదికి పది పాయింట్లు ముగ్గురు విద్యార్థులకు రావడం. అభినందనియమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే రాష్ట్రంలో విద్య రంగానికి సీఎం కేసీఆర్. ప్రాధాన్యత ఇవ్వడం.జరుగుతుంది.గతంలో మన ప్రాంతం అక్షరాస్యతలో వెనుకబడి ఉండేది కానీ ఇప్పుడిప్పుడే ప్రతి గ్రామంలోని ప్రజలు వారి పిల్లలు చదువుకోవాలని వారి భవిష్యత్తులో మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచించి ప్రతి ఒక్కరూ వారి పిల్లలను చదివిపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి చదువు ఇష్టపడి చదువుకోవాలి చదువు వల్ల మనకు జ్ఞానము సంస్కారం నేర్చుకోవచ్చు. గద్వాల ప్రాంతంలోని విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేకుండా మన ప్రాంతంలోని అన్ని రకాలుగా డిగ్రీ కళాశాలలు ఇటీవల నర్సింగ్ కాలేజీ త్వరలో  మెడికల్ కాలేజీ గద్వాల ప్రాంతంలోకి విద్య వ్యవస్థకు సంబంధించిన ఎంబీఏ పిజి అంటే కాలేజీ కూడా విద్యార్థులకు అందుబాటులో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకుండా ఈ పదవ తరగతి పరీక్షలో మంచి మార్కులు సాధించి ఇంటర్ కూడా మంచి ఫలితాలు సాధించి మీ బంగారు భవిష్యత్తుకు దిశానిర్దేశం  నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, ఇతర అంశాలపై దృష్టిసారించాలని సూచించారు.  అలాగే చదువులో పిల్లలకు ఒత్తిడి పెట్టరాదన్నారు. వారికి ఇష్టమైన రంగంలో చదువునుంచుకునే విధంగా వారికి అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఎక్కువగా పిల్లలు ఈ పరీక్షా సమయంలో టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు  దూరంగా ఉండాలి.  సెల్ ఫోన్ ఎంత వరకు ఉపయోగించుకొని అంతవరకే దానిని ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులు విద్యతోపాటు ఎన్ సీ.సీ లో రాష్ట్రస్థాయిలో మంచి నైపుణ్యం  ప్రదర్శించారని కొనియాడారు. రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభను సాధించి గద్వాలకు మంచి పేరును తీసుకొచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని ఒక లక్ష్యం నిర్ణయించుకొని బంగారు బాటలు వేసుకోవాలని కోరారు.

ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదవడం కన్నా ఇష్టపడి చదవడం మిన్న త్వరలో జరగబోయే పదవ తరగతి  విద్యార్థినీ విద్యార్థులకు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మీ ఊరికి మీ పాఠశాలకు గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. యువత సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అనంతరం జా ఎన్టీఆర్ సేవాసమితి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ముదిరాజ్ చిరు. ఆధ్వర్యంలో నిర్వహించిన. టెన్త్ క్లాస్ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే. చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. జూ. ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. 

ఇటీవలే తెలుగు చలనచిత్రంలో తొలిసారిగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్. సినిమాలో నటుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్,  నాటు నాటు పాటకు ప్రపంచంలోనే ప
అత్యుత్తమమైన ఆస్కార్ అవార్డు రావడం చాలా గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆ సినీ యూనిట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్. తరపున, నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.  ఇలాగే భవిష్యత్తులో మంచి సినిమాలను తీసి ప్రజలకు సందేశం సినిమాలను వచ్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి వారు ఇదే విధంగా భవిష్యత్తులో అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా నిలువడం కోరారు. మిగతాసినిమా హీరోల అభిమానులు కూడా ఇలాంటి సామాజిక  కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య,  వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ కృష్ణ, నరహరి శ్రీనివాసులు, మహేష్, దౌలు గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కురుమన్న, రామకృష్ణ నాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు, జిల్లా జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు చిరు ముదిరాజ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు