గద్వాల జిల్లా ఇంటర్ టాపర్ కు పేదరికం అడ్డు

గద్వాల జిల్లా ఇంటర్ టాపర్ కు పేదరికం అడ్డు

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి : అయిజ మండలం బింగిదొడ్డి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, మారెమ్మ దంపతులు కూలీ పనులు చేసి కూతురుని చదివించారు. కుమార్తె అనిత మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అభ్యసించింది. మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో బైపీసీలో 1000 మార్కులకు 984 మార్కులు సాధించి, జోగులాంబ గద్వాల జిల్లా టాపర్ గా నిలిచింది. కాగా బుధవారం అనిత ను పైచదువులు చదివించడానికి పేదరికం అడొస్తుందని, కుటుంబపోషణ భారంగా మారిందని తమను ఆదుకోవాలని శ్రీనివాసులు కోరారు.

83741 15297 అనిత వాళ్ళ నాన్న నంబర్.. శ్రీనివాసులు. బింగిదొడ్డీ