పురుగుమందు డబ్బాలతో చిన్నోనిపల్లి భూ నిర్వాసితుల నిరసన..!

పురుగుమందు డబ్బాలతో చిన్నోనిపల్లి భూ నిర్వాసితుల నిరసన..!

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి : జిల్లా, గట్టు మండలానికి చెందిన చిన్నోనిపల్లి భూ నిర్వాసితులు శనివారం చిన్నోనిపల్లి దగ్గర జరుగుతున్న ప్రాజెక్ట్ పనులు ఆపీ, పురుగు మందు డబ్బాలతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గట్టు మండలంలోని నెట్టెంపాడు 101 ప్యాకేజీ కింద నిర్మిస్తున్నటువంటి రిజర్వాయర్ ను 18 సంవత్సరాల క్రితమే పూర్తి చేసి ఉండుంటే అపుడే ఇడ్లు కట్టుకునే వాళ్ళం. ఇన్ని సంవత్సరాల తరువాత వచ్చి పూర్తి చేస్తే ఇప్పుడున్న రేట్లకి, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక బాత్రూమ్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఈ గ్రామం ప్రజలు ఉన్నారన్నారు.చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో  మునిగిపోతున్న ఇల్లు 251 ఆర్ అండ్ ఆర్ సెంటర్లో 360 ఇండ్లు కట్టించాలని కోరారు.

గ్రామంలో సుమారు 4000 పైచిలుకు ప్రజానీకం అన్యాయమైపోతుంది, రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఇల్లు ఒక్కరుము కట్టుకోవాలన్న కనీసం  12 లక్షల దాకా అవుతుంది అలాంటప్పుడు ఆర్ అండ్ ఆర్ సెంటర్లో గుంతలలో పోయి ఎలా ఇల్లు కట్టుకొని బ్రతకాలని మునిగిపోతున్న గ్రామ ప్రజలు చిన్నోనిపల్లి గ్రామం  అవస్థలు పడాల్సి వస్తుంది భూములు కోల్పోయిన మొత్తం 2464 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నది గ్రామం మొత్తం ముంపులో పోతుంది సర్వం కోల్పోయిన ప్రజలను,రైతులను ఆదుకోవాలని ఈ రిజర్వాయర్ విషయంలో రైతులకు మన తెలంగాణ జిల్లా రాష్ట్రంలోని వట్టెం ప్రాజెక్టు దగ్గర ఇచ్చిన జీవోని మా చిన్నోని పల్లి గ్రామానికి వర్తింపజేసే విధంగా చూడాలని కోరారు.వచ్చిన నెల 4వ తారీఖున సీఎం కేసీఆర్. గద్వాల్ కు వస్తున్న సందర్భంగా చిన్నోనిపల్లి గ్రామము గురించి ఏదైనా మాట్లాడుతారని ఆసక్తికరంగా గ్రామ ప్రజలు ఉన్నారు. సీఎం కేసీఆర్ అలాగే, గద్వాల స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జడ్పిటిసి బాసు శ్యామల, గట్టు మండలం ఎంపీపీ జె విజయ్ కుమార్, చిన్నోనిపల్లి గ్రామ సర్పంచ్ ఉమా దేవేందర్, గ్రామం పై దయవుంచి న్యాయం చేసే విధంగా చూడాలని, చిన్నోనిపల్లి రిజర్వాయర్ గ్రామం ఇండ్లు భూములు మొత్తం సర్వం కోల్పోయిన భూ నిర్వాసిత రోడ్డున పడ్డ రైతులు ప్రజలు విజ్ఞప్తి చేశారు.