పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన ఏపూరి సోమన్న

పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన ఏపూరి సోమన్న

ముద్ర  తిరుమలగిరి: తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం నాడు పలువురి కుటుంబాలను పరామర్శించి సుమారు 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన వైఎస్ఆర్ టి పి  తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న. మండలంలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన చీకటి మల్లయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వైద్య ఖర్చుల నిమిత్తం 10 వెలు అలాగే ఇటీవల మరణించిన చింతకుంట్ల లాలయ్య దశదిన కర్మలో పాల్గొని ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారి కుటుంబాలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టి పి తుంగతుర్తి మండల శాఖ అధ్యక్షులు చింతకుంట్ల పరమేష్ ఏపూరి యాకన్న సైదులు మాచర్ల ఉపేందర్ జలగం కళ్యాణ్ యాదగిరి నాగేష్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు