పాఠశాలల బంద్ పిలుపు సక్సెస్

పాఠశాలల బంద్ పిలుపు సక్సెస్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పాఠశాలల బంద్ పిలుపు బుధవారం విజయవంతం అయింది. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు ముందుగానే సెలవు ప్రకటించారు. ఈ మేరకు వివిధ సంఘాల నేతలు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను గాలికి వదిలేసిందన్నారు. కొన్ని వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేసి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ, ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో శీతల్కర్ అరవింద్ ,నవీన్, కైలాస్,
అంబాదాస్, రాజు,సింగారి వెంకటేష్ , దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.