పోగొట్టుకున్న పర్సు అందజేత

పోగొట్టుకున్న పర్సు అందజేత

ముద్ర న్యూస్ రేగొండ.... ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న పర్సును బాధితురాలికి అందచేసి మంచిమనసు చాటుకున్నారు ఆర్ఐ జూపాక నరేష్ . నరేష్ తెలిపినవివరాలప్రకారం మహదేవ్పూర్ గ్రామానికీచెందిన కంకణాల సుజాత కూకట్ పల్లి నుండి భూపాలపల్లి కి సూపర్ లక్సరి బస్ లో ప్రయాణిస్తుండగా భారీ వర్షం కారణం గా హన్మకొండ బస్సు స్టేషన్ లో దిగుచున్న సమయంలో తన వద్ద ఉన్న పర్స్ ను బస్ సీట్ లో మర్చి పోయారు.

అట్టి పర్సు ఆర్ ఐ నరేష్ కి దొరికినది. అట్టి పర్సు లో రూ.5000 నగదు,విలువైన భూమి పత్రాలు ఉండగా అందులో ఉన్న గుర్తింపు కార్డు ద్వారా అడ్రస్ ను కనుక్కొని వారికి సమాచారం అందించారు. ఈరోజు రేగొండ తహసీల్దార్ గారి కార్యాలయం లో తహసీల్దార్ గారి చేతుల మీదుగా వారికి పర్సుతో పాటు, నగదు, డాక్యుమెంట్స్ అందించారు. పర్శును అందించిన గిర్ధావర్ నరేష్ కి మహిళ కృతజ్ఞతలు తెలిపింది. నిజాయితీగా వ్యవహరించి మహిళకు విలువైన పర్సు భూమి పత్రలు అందచేసిన గిర్డవర్ ను తీసుకెళ్ళి తహశీల్దార్ శర్ఫోద్దిన్ అభినందించారు.