నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం

నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం

కోదాడ డిఎస్పీ కోదాడ టౌన్ పరిదిలో ని సిసి కెమెరాల నిర్వహణ, మరమ్మత్తుల గురించి కమిటీతో భేటీ

ముద్ర ప్రతినిధి , కోదాడ ..... నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర చాలా కీలకం అని కోదాడ డిఎస్పీ బి.ప్రకాష్ అన్నారు . సోమవారం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో కోదాడ పట్టణ సిసి కెమెరాల నిర్వహణ కమిటీతో సమావేశమై చర్చించారు . రాబోయేది ఎన్నికల సమయమని సిసి కెమెరాల పాత్ర చాలా కీలకం అని ఇప్పటికే పట్టణంలో ఉన్న కెమెరాలను మరమ్మత్తులు చేసి పని చేసే విధంగా చూడాలని , మరికొన్ని కొత్త కెమెరాలను అమర్చాలని , ప్రధాన కూడళ్లలో మరి కొన్ని కెమెరాలు కచ్చితంగా అవసరమని సమావేశంలో చర్చించారు . ప్రధాన కేసులలో నేరస్తులను సిసి కెమెరాల ద్వారానే గుర్తించిన సంఘటనలు అనేకం ఉన్నాయని ఆయన అన్నారు . ఇట్టి సమావేశంలో పట్టం సిఐ టి . రాము , సిసి కెమెరాల సొసైటీ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి, డాక్టర్ సుబ్బారావు , డాక్టర్ శ్రీపతి రెడ్డి ,మేళ్లచెరువు కోటేశ్వర్ రావు , కొమరగిరి రంగా రావు పాల్గొన్నారు .