కోదాడలో బీ ఆర్ఎస్ కు భారీ షాక్

కోదాడలో బీ ఆర్ఎస్ కు భారీ షాక్
  • మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు రాజీనామా...?
  • పొంగులేటితో మంతనాలు కాంగ్రెస్ లో చేరే అవకాశం
  • ఆయనతో పాటే కమ్మ సామాజిక వర్గం నేతలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఈ వేసవిలో ఎండను మించిన వేడి ప్రస్తుత రాజకీయాల్లో ప్రస్ఫుటమవుతుంది కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు సాధించడంతో ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడడం ఒక భాగం కాదా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధికార పార్టీలో ప్రకంపనలు మొదలవుతున్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార బీఆర్ ఎస్ పార్టీలో ఇన్నాళ్లుగా చాప కింద నీరు లాగా నెలకొన్న అసంతృప్తి నేతలు ఒక్కరొక్కరుగా బయటపడుతున్నారు
తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన బీ ఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే పుకార్లు షికారులుగా బలంగా వినిపిస్తున్నతో ఆ ప్రభావం ఖమ్మం జిల్లా కు ఆనుకుని ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా పై మొదటగా ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది ముఖ్యంగా  ఖమ్మం కు సరిహద్దుగా కలిగిన కోదాడ నియోజకవర్గంలోని ప్రముఖ నాయకులు అధికార బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనలు మొదలుపెట్టారని తెలుస్తుంది

కోదాడలో బీ ఆర్ఎస్ కు భారీ షాక్

అధికార పార్టీ కోదాడ నియోజకవర్గ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ వైఖరితో మొదటి నుండి అక్కడ ఇరువర్గాలు డి అంటే డి అంటూ ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలిపోయింది కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జి కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు సీనియర్ రాజకీయవేత్త వేనే పెళ్లి చందర్రావు మాజీ డిసిజిబి చైర్మన్ ముతవరపు పాండురంగారావు వెంకటరత్నం (బాబు) తదితరులు ప్రధాన సూత్రధారులుగా పాత్రధారులుగా ప్రస్తుత ఎమ్మెల్యే పై బాహటంగానే పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పార్టీలో మొదటినుండి ఉన్న వారిని లెక్కచేయకుండా అవినీతికి ఎమ్మెల్యే బహటం గానే తరలిపోయాడని అందువల్ల కోదాడలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతుందని ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు నిర్వహించిన సర్వేలలో కూడా ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని వైరివర్గం వ్యాఖ్యానించింది. ఈ నేపద్యంలో ఏ పార్టీలో చేరాలని ఆలోచనతోపాటు అసలు ప్రస్తుత పార్టీలో ఉండాలా ఇతర పార్టీలోకి వెళ్లాలని ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం గత కొంతకాలంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వారికి సరైన వేదిక దొరకక తర్జనభజనలు పడి చివరకు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంచన చేరాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మొదటగా పాండురంగారావు ఆ తర్వాత ఇతర నేతలు

కోదాడ రాజకీయాల్లో అపార అనుభవం పట్టు ఉన్న మాజీ డిసిసిబి చైర్మన్ కమ్మ సామాజిక వర్గాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ముత్తవరపు పాండురంగారావు మొదటగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాలని నిశ్చయించుకున్నట్టు విశ్వసనీయవర్గాల బోగట్ట. ఈ మేరకు ఆయన గత కొన్ని రోజులుగా పలు దఫాలుగా తన 
హితులు సన్నిహితులు తనతో వచ్చే మండల పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు వార్డు సభ్యులతో రాజకీయ భవిష్యత్తును చర్చించినట్టు సమాచారం. ఆయనతోపాటు పెద్ద ఎత్తున కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు కూడా పాండురంగారావుతో వెళ్లనున్నట్టు పలు గుసగుసలు కోదాడలో వినిపిస్తున్నాయి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్వయంగా కలిసి కాంగ్రెస్ లో చేరే అవకాశం పై పాండురంగారావు ఒక నిర్ణయానికి వచ్చినట్టు అనుకుంటున్నారు

హుజూర్నగర్ నియోజకవర్గం పై కూడా ప్రభావం

ముత్తవరపు పాండు రంగారావు కేవలం కోదాడ నియోజకవర్గంలో కాకుండా తన అనుచరులు బంధు వర్గం మిత్రులతో కూడా హుజూర్నగర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలోని అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రభావం పడనుంది. తన అనుచరులు వేలాది మందితో భారీ ఎత్తున కాంగ్రెస్ లో చేరడానికి పాండురంగారావు పావులు కదుపుతున్నారని తెలిసింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా పై కూడా ప్రభావం ఉండే అవకాశం

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఆయన అనుచరులు బంధువులు మిత్రులు ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ తో పాటు బిజెపిలో కూడా ఉన్న అసంతృప్తి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు  పలువురు చెవులు కొరుక్కుంటున్నారు ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ సూర్యాపేటకు రానున్నట్టు రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇదే కనుక జరిగితే జిల్లాలో అధికార పార్టీకి గండి పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు

పొంగులేటికి టచ్ లో సూర్యాపేట బీ ఆర్ఎస్ నేతలు...?

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పలువురు టిఆర్ఎస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన వెంట వెళ్లడానికి సిద్ధం చేసుకున్నట్టు సమాచారం మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, విజయవాడకనకదుర్గ దేవాలయం మాజీ డైరెక్టర్ పెద్దిరెడ్డి రాజా తన అనుచరులతో పొంగులేటితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఆలోచన చేస్తున్నట్టు పెద్దిరెడ్డి రాజా సన్నిహితులు పేర్కొంటున్నారు ఈ మేరకు ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పెద్దిరెడ్డి రాజా సమావేశం అయ్యారు ఇలా ఒక్కొక్కరుగా పలుద పాలుగా అసంతృప్తితో ఉన్న నేతలు త్వరలో బయటపడి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందనే రాజకీయ వ్యాఖ్యానాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి

ఏదేమైనా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ ప్రభావం పక్కనే ఉన్న సూర్యాపేట కోదాడ హుజూర్నగర్ తుంగతుర్తి నియోజకవర్గాలపై ఎక్కువ  ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు ఈ మేరకు కొద్ది రోజుల్లోనే ఆయా పార్టీల్లో రానున్న కలుగనున్న రాజీనామాలు చేరికలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది