ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై హర్షం

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై హర్షం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: స్వర్గీయ ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది మురుము చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేయడం పట్ల సామాజికవేత్త విశ్రాంత ఉపాధ్యాయులు గుండారమే హర్షం వ్యక్తం చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి, భారత ఇతిహాసాలలోని నాయక ప్రతినాయక పాత్రలను అద్వితీయంగా పోషించి భావితరాలకు భారత సంస్కృతి సాంప్రదాయాలను తెలిపి మార్గదర్శకులుగా నిలిచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్కు కేంద్ర ప్రభుత్వం తెలుగుజాతికిచ్చిన అరుదైన గౌరవమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు వెండితెర వేల్పుగా మరియు రాజకీయ ప్రస్థానంతో యువతకు ఉపాధి కల్పించిన మహనీయుడని అందుకే ఎన్టీఆర్ శకపురుషుడని రమేష్ తెలిపారు. అంతేకాక కేంద్ర రాజకీయాలకు సైతం దశాదిశను నిర్దేశించిన మహనీయుడని.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని ఇది తెలుగు ప్రజల అభీష్టమని రమేష్ అభిప్రాయపడ్డారు